వైకుంఠపాళి - చావా
ఈ పేజీ ని పంపండి

"India పోతావా? ఎందుకన్నా ఇక్కడే ఉండక హాయిగా?"

"India పోతే అందరు పైసలు పైసలు తప్పితే వేరే మాటే లేదన్నా. అందరికీ అమెరికా పోతే ఇక మనకి పైసలకి కొదవే ఉండదు అన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్లకి తెలిసింది ఒక్కటే.. ఒక డాలర్ అంటే 45 రూపాయలు. ఇక్కడ ఎన్ని డాలర్లు ఖర్చు అవుతాయి, ఎంత tax కడతాము, ఇవేమి చెప్పినా వినే పరిస్థితి లో లేరు అక్కడ"

మొన్నే India నుండి వచ్చిన మా ఆదిత్య మాటలు ఇవి.

వింటూ ఉంటే నాకనిపించింది.. నిజమే కదా.. మనమూ దేశం లో ఉన్నప్పుడు ఇలానే అలోచించి ఉంటాము. తనదాకా వస్తే గాని ఏదైన తెలియదని అన్నట్లు.. ఇంటికొకడు ఇప్పుడు అమెరికాలో ఉంటున్నారు. ఎందుకు ఈ వెర్రి? నా వరకు నేను ఇక్కడికి వచ్చింది చదువుకోడానికి. చదువు India లోనే చదవొచ్చుగా అంటారేమో.. చదివామండీ బాబు.. కానీ చదివిన చదువుకి దొరికిన ఉద్యోగం నచ్చలేదు.. ఉద్యొగం మారలంటే తగిన విద్యార్హతలు లేవు. ఇవ్వం పొమ్మన్నారు.. ఏం చేయాలి? మనకి అంత త్వరగా, అంటే ఇక్కడున్నంత తేలిగ్గా అక్కడ మైనింగ్ చదివిన వాడు M.Tech CS చెయ్యలేడు కదా? అందుకే అమెరికా దారి పట్టాం.

సరే వచ్చాం.. చదివాం.. చదువు అయ్యాక ఇంకో సమస్య.. India లో ఉద్యోగం దొరుకుతుందా పోతే? దొరక్క పోతే ఇంత చదువూ చదివి వృధాయే కదా? అని." అక్కడే కొన్నాళ్లు ఉద్యొగం చేయి.. అనుభవం ఉంటే తేలిగ్గా దొరుకుతుంది" అన్నారు చాలా మంది. సరే అని ఉద్యోగం లో చేరా.. అది కూడా నానా కష్టాలు పడి.. మన దురదౄష్టానికి సరిగ్గా ఇదే సమయానికి Software industry, ఆ లెక్కకొస్తే మొత్తం అమెరికా economy నే కుప్పకూలింది. ఏదోలా ఒక ఉద్యోగం సంపాయించాం. ఇప్పుడు ఒక సంవత్సరం అయ్యాక పోదామనుకొన్న India.. కాని వెళ్లగలిగేలా లేను. ఎందుకయ్యా అంటే ఉద్యొగం లో చేరాం కాబట్టి మన స్టేటస్ మారింది. ఖర్చులు పెరిగాయి. కనీస అవసరాలు సమకూర్చుకోవలిసి వచ్చింది. మనకో కారు కావాలి (కారు ఇక్కడ luxury కాదు దేశ సోదరా!!!).. దానికి ఒకేసారి ఇరవయ్యో, పాతికో వేలు పెట్టి ఒకేసారి కొనే స్థోమత లేదు కాబట్టి (చాలా మంది అమెరికన్లకి కూడ ఉండదు లెండి), అప్పు చేయలి. అప్పు కి వడ్డీ తో సహా 5 సంవత్సరాలలో తీర్చేలా. 5 సంవత్సరాలు ఇక్కడ ఉంటే లిస్ట్ లో next item ఇల్లు కొనుక్కోడం. "ఇల్లు కొంటే లాభాలు ఎక్కువ.. tax లు తక్కువ పోతాయి.. apartment కి అద్దె కట్టే బదులు ఇల్లు కొనేసి ఆ tax లు మిగుల్చుకొంటే ఇల్లు ఒకటి మన సొంతం అవుతుంది కదా" అనేది బలం ఉన్న వాదన కాబట్టి మనమూ దానికి కూడ లొంగుతాం.

ఇంక ఇల్లుకొని, పెళ్లి చేసుకొని, సంసారం అంతా ఇక్కడే మొదలెట్టే సరికి మళ్ళీ మన చేతిలో balance సున్న! అంటే కధ మళ్ళా మొదటికే వచ్చిందన్న మాట!

మళ్ళా కొన్నాళ్ళు ఉండాలి.. మిగల్చాలి.. పోవాలి.. ఈ లోపు లో పిల్లలు చదువు. స్కూల్ ఖర్చులు.. మన బెట్టర్ హాఫ్ కి కూడ ఓ కారు.. అన్నిటికి పైన సంపాదన లో సగం పైన tax లు.. మనం దోచుకోడం అంటాం దీనిని.. కాని సమర్ధం గా ప్రభుత్వాన్ని నడపడం అంటా నేను. సరే అది వెరే కధ అనుకోండి.

నిచ్చెన ఎక్కడం పూర్తి కాకుండానే పాము మింగుతూ ఉంది.. ఈ ఆట చాలా కష్టం గా ఉండండీ నాకు.. మరి మీకెలా ఉంది?

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత చావా కి తెలియచేయండి.