అమెరికా లో మినీ ఆంధ్రులు - ప్రత్యూష
ఈ పేజీ ని పంపండి

అమెరికా లో వున్న కొన్ని ప్రాంతాలు ఆంధ్ర ఫీలింగ్ తెప్పించినట్టు అనిపిస్తుంది. ఉదాహరణకి California లో Sunnyvale (కొంత వరుకు Fremont కూడా), Chicago లోని కొన్ని ప్రాంతాలు -- Schaumburg, Devon, Desplaines,Newyork లోని Queens (కొంత వరకు) మరియూ కొండ మీద న్యూ జెర్సీ.

అయితే ఈ ప్రాంతాల లో కేవలం ఆంధ్రా ఏ కాదు ఉత్తర భారత దేశం రుచి కూడా ముఖ్యం గా మనకి కనిపిస్తుంది.

California లోని Sunnyvale:

ఇక్కడ సగం మసాలా చాయ్ కూడా దొరుకుతుంది. కొన్ని అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో అయితే కేవలం మన తెలుగు వాళ్ళు మాత్రమే వున్నారా? అనే సందేహం కూడా నాకు వచ్చింది. Sunnyvale ని చాలా మంది ముద్దుగా “ఆంధ్రా అడ్డా” అన్ని పిలుచుకుంటారు. ఇక్కడకి ప్రతీ సినీ అభిరుచి వున్న ఆంధ్రుడూ ఎప్పుడో అప్పుడు వచ్చితీరాలి. ఎందుకు అంటారా? మరి ఇక్కడ IMC-6 (Indian Movie Center) వుంది కాబట్టి! (ఈ హాల్ లో మెగాస్టార్ సినిమాకి ఈలలూ మరియూ రంగు రంగు కాగితాలు వేసి సందడి చెయ్యడం సర్వ సాధారణం). Sunnyvale లో దొరకని ఆంధ్రా వస్తువు అంటూ వుండదు ఎమో మరి!. మనం Sunnyvale ప్రాంతం లో వున్నప్పుడు మన కుటుంబ సభ్యుల తో కానీ స్నేహితుల తో కానీ తెలుగు లో మాటలు అడేటప్పుడు జాగర్త గా వుండాలి. ఎందుకు అంటారా? ఇక్కడ మన పక్క నుండి పోయేవరికి గ్యారంటీగా తెలుగు వచ్చే వుంటుంది. (అమెరికా లో చాలా ప్రదేశాలలో ఈ పరిస్థితి లేదు).

Chicago లొని - Schaumburg, Devon, Desplaines వగైరా:

కాలిఫోర్నియా లో లాగే అన్ని దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ బంగారం కొట్టులు మీద మన తెలుగు పేర్లు చక్కగా కనిపిస్తాయి కూడా. Devon street చాలా పేరు వున్న వీధి. ఇక్కడ కేవలం తెలుగు, హింది నే కాక మిగిలిన దేశాల వాస్తవ్యులు కూడా కనిపిస్తారు. అంటే, పాకిస్తాన్, రష్యన్, ఇరిష్, జ్యూయిష్ వగైరా.

Newyork - Queens కొంత వరకే అని ఎందుకు అన్నాను అంటే, Newyork లో దక్షినాది వాళ్ళ కన్నా ఉత్తరాది భారతీయులు చాలా ఎక్కువ వున్నారు. ఉదాహరణకి. ఇక్కడ బిచ్చగాళ్ళు (Beggars) hindi లో “namaskar kesa ho tum? అన్ని అడుగుతారు! కాకపోతే Queens లో దొరకని భారతీయ వస్తువు అంటూ వుండదు అని ఓ పెద్ద పేరు. మరి ఎంత వరుకూ నిజమో నాకు తెలీదు. Newyork Queens లో బాంబే సంస్కృతి చాలా ఎక్కువగా కనిపిస్తుంది.

Newjersy లో ఏ చోటు అని చెప్ప లేము, ఎందుకు అంటే అన్నిటి లోనూ మనకి భారతీయులు, అందులో తెలుగువారు కనిపిస్తారు .

ఆమెరికా లో ఎన్ని వున్నా మన తెలుగు నీరు (గోదావరి, కృష్ణవేణి, పెన్నా, తుంగభద్రా), తెలుగు మట్టి, మనం పుట్టిన ఇల్లు, తెలుగు గాలి ఇంకా చాలా లేవు! వీటి అన్నిటి కోసం రోజులు రోజులు కష్ట పడి ప్రయాణం చేసి కనీసం సంవత్సరానికి ఒక్క సారి అయినా వెళ్ళి నెలో రెండు నెలలో వుండి వస్తాము మనము.

ఎందుకు?

అదే తెలుగుతనం లోని తియ్యదనం!

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత్రి ప్రత్యూష కి తెలియచేయండి.