"షాది మాటే వద్దు గురూ.. సోలో బతుకే సో బెటరు!!!!" - చావా
ఈ పేజీ ని పంపండి

"షాది మాటే వద్దు గురూ.. సోలో బతుకే సో బెటరు!!!!"

"మా వాడికి సంబంధాలు చూస్తున్నామండి"

"అలాగా!! అంటే అమెరికా economy recover అయినట్టే నా?"

ఆశ్చర్యపోతున్నారా? నిజమండి బాబు!! ప్రస్తుతం జనాల ధోరణి ఇలానే ఉంది. కుర్రాడు అమెరికా లో ఉండటం ఒకప్పుడు గొప్ప. ఇప్పుడు అదొక్కటే కాదు.. ఇంకా చాలా విషయాలు పరిశీలిస్తున్నారు అమ్మాయినివ్వడానికి. చిన్నపాటి background check, ఉద్యోగం ఇవ్వబోయేముందు చేస్తారు చూడండి అలాంటిది చేస్తున్నారు. కాకపోతే ఆ చెక్ లొ పరిశీలించే విషయాలు మారుతున్నాయి. మచ్చుకి కొన్ని:

ఎంతకాలం నుండి ఉంటున్నాడు?

వీసా status ఏంటి?

చేసే ఉద్యోగం పర్మనెంటా ? కాంట్రాక్టర్ గానా?

H1 validity ఎంత కాలం?

green card కి apply చేసాడా? చేస్తే ఏ stage లో ఉంది?

ఇంకా కొంతమంది ఒకడుగు ముందుకి వేసి recent pay stubs అడుగుతున్నారు అని కూడా వింటున్నాం.

ఇక పెళ్లి చూపులు.. అది Microsoft ఇంటర్వ్యూ స్థాయిలో ఉంటుందట. ఈ మధ్య మా వాడినొకడిని మీ ప్రొఫెషనల్ స్కిల్స్ ఏంటి అని అడిగిందట ఓ అమ్మాయి!! మీకు ఏమేమి వచ్చు? C, C++, Java, Unix గట్రా వన్న మాట. ఇంతా అడిగి మా వాడిని నువ్వు క్వాలిఫై కాలేదు పో అన్నారు సుమా!! కారణం ఏంటను కొంటున్నారు? వీడు ఇ-కాం related ప్రోజెక్టు లో పనిచేస్తుండటం.. ఇవాళ, రేపు డాట్ కాం కంపెనీ ల పరిస్థితేం బాలేదు.. వీడి ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అనుకొని ఉంటారు!

ఇక ఈ మధ్య పేపర్లలో "పెళ్లి సంబంధాలు" శీర్షిక లో ప్రకటనలు చూసారా ఎప్పుడైనా? మచ్చుకి ఒకటి చూడండి:

వయసు:26, C ,C++,Unix వచ్చిన అందమైన వధువు కి సరయిన వరుడు కావలెను.. వివరాలకి సంప్రదించండి..

చూడగానే ఏదో ఉద్యోగ ప్రకటనలా కనిపించింది తప్పితే పెళ్లి ప్రకటనలా లేదది. దీన్ని బట్టి తేలింది ఏంటయ్యా అంటే, సమాచార విప్లవం ప్రభావం మనమీద మనకి తెలియకుండానే చాల ఉంది.

కొసమెరుపు:

"ఏరా! పెళ్లెప్పుడు చేసుకొంటావ్?" దేశం లోనే ఉన్న మా వాడిని అడిగా.

"చేసుకో దలచు కోడం లేదు. ఎవడ్ని పిల్లనిమ్మన్నా, కుర్రాడు అమెరికా లో ఉండడా??? అలా అయితే sorry అంటున్నార్రా"

ఈ లెక్కన అటు దేశం లో ఉన్న అబ్బాయిలకి, ఇటు దేశం బయట ఉన్న అబ్బాయిలకి కూడా పెళ్లిళ్లు జరగడం కష్టమే మరి!

కాబట్టి నాయన లారా "షాది మాటే వద్దు గురూ ...సోలో బతుకే సో బెటరు" అని పాడుకోడం మొదలెట్టండి.

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత చావా కి తెలియచేయండి.