Sexy Sexy.. - SKU
   ఈ పేజీ ని పంపండి

90s లో గోవిందా, కరిష్మా కపూర్ నటించిన "ఖుద్దార్" అనే సినిమా వచ్చింది. అందులో Sexy Sexy అని ఒక పాట ఉంది. దానికి మన భారత దేశం లో మహిళలూ, సంస్కృతి పరిరక్షకులూ నొచ్చేసుకొని ఆ పాట లోని Sexy అనే మాట ని baby అనే మాట తో మార్చే దాకా ఒప్పుకోలేదు. కానీ వీరికి ఆ సినిమా లోని కరిష్మా కపూర్ పొట్టి దుస్తులు కానీ, కనువిందు చేసిన sexy .. క్షమించాలి.. baby moves మాత్రం వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం అనిపించలేదు.

* * *

ఈ ప్రస్తావన ఎందుకంటే, క్రితం వారం జైపూర్ లో ఒక సభ లో NWC చైర్ మహిళలనీ ఉద్దేశించి, "ఎవరైనా మిమ్మల్ని ఆకతాయి కుర్రాళ్ళు వేధించటానికి Hi Sexy అని పిలిస్తే, మీరు కోపం తో ప్రతిస్పందించకూడదు, దానిని పాజిటీవ్ గా తీసుకోవాలి" అన్నారు.

దీనికి, ఆ హోదా లో ఉండి ఆవిడ ఆ విధం గా అనటం మహిళలని అవమానించటం కనుక ఆవిడ తక్షణం రాజీనామా చేయాలి, మహిళలకి క్షమాపణలు చెప్పాలి అని కొంతమంది ఉద్యమం లాంటిది మొదలెట్టారు.

నా అభిప్రాయం అడిగితే, తెలియని వ్యక్తి ఎవరన్నా వేధించే ఉద్దేశం తో sexy అని పిలిస్తే చిరాకు వేస్తుంది. ఆ సమయం లో ఉండే మూడ్ ని బట్టి దానికి నా ప్రతిస్పందన ఉంటుంది. అవతల వ్యక్తి లోని వెకిలి ఉద్దేశం ప్రస్పుటం గా కనిపిస్తున్నప్పుడు ఆ వ్యక్తి sexy అనే అనక్కర్లేదు, వంకర చూపులతో ఏం మాట్లాడినా అది అవమానకరంగానే అనిపిస్తుంది. చిరాకే వేస్తుంది.

ఇప్పుడు మమతా శర్మ రాజీనామా చెయ్యాలి అని డిమాండ్లు చేస్తున్న మహిళామణులకి నాదొక ప్రశ్న.. ఇదే ప్రశ్న మా అమ్మగారిని కూడా అడిగాను ఇవాళ పొద్దుట.

ఇవాళ ఇండియా లో ఎవ్వరిని చూసినా కిటికీల జాకెట్లూ, మాధురీ దీక్షిత్ టైపు వెనుక కనిపించే జాకెట్లూ వేసుకొని తిరుగుతున్నారు. ఒక్క అదే కాదు, కాళ్ళు బాగున్నాయి అనిపించిన వాళ్ళు షార్ట్ లు వేసుకుంటున్నారు. మిషెల్ ఒబామా కి ఉన్న జబ్బలు ఉన్నాయి అనుకున్న ప్రతీ వారూ స్లీవ్ లెస్ బ్లౌజ్ లు వేసుకుంటున్నారు. అటువంటి అందమైన శరీర భాగాల కోసం వాళ్ళు జిమ్ కి వెళ్ళో కడుపు కాల్చుకొనో లేక చిత్ర విచిత్రమైన డైట్ లు ఫాలో అవటమో చేసి ఉంటారు. ఇంత కష్టపడి సైజు 14 నుండి సైజు 4 పేంట్ సైజ్ కి దిగినప్పుడు అవి వేసుకొని, బయటకి గర్వం గా వెళ్ళినప్పుడు అక్కడ ఉద్దేశం ఏమిటి.. తనని గురించి కామెంట్లు చేసే అధికారం కేవలం తనకి ఇష్టులకే ఇస్తున్నట్టా? అలాంటప్పుడు బయటకి వెళ్ళటం ఎందుకు? ఇంట్లోనో అద్దం ముందో తన వాళ్ళ ముందో అవి వేసుకోవచ్చు కదా?

కానీ అలా ఇంట్లో ఉండు అంత నీకు ఇష్టం లేని వ్యక్తుల మాటలు వినటం ఇష్టం లేకపోతే అని చెప్పగలమా? చెప్పలేము.

మీకు పోకిరి సినిమా గుర్తు ఉండే ఉంటుంది. అందులో ఇలియానా "I may not be PERFECT but parts are pretty AWESOME" అని రాసి ఉన్న T-Shirt వేసుకుని వెళ్తుంటే మహేష్ వచ్చి ఆమె T చదువుతూ మధ్యలో నట్టుతుంటే, ఆమె కొంచెం సాయం కూడా చేస్తారు. ఆమె అటువంటి ద్వందార్థాలు వచ్చే షర్ట్ వేసుకున్నారని ఆమెని వేధించిన అశీష్ విద్యార్థి పాత్ర తప్పు ఏమన్నా తగ్గుతుందా?

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.