"వయసులు వరుసలు తెలియని సరసులు.. సన్నాసులు!" - SKU
ఈ పేజీ ని పంపండి

"వయసులు వరుసలు తెలియని సరసులు.. సన్నాసులు!"

నిన్నేపెళ్ళాడుతా సినిమాలోని ఒక పాట లోని ఈ వాక్యం విన్నప్పుడల్లా చాలా నవ్వుకుంటుంటాను.

New Jersy వెళ్ళినపుడు మా ఫ్రెండ్ కాంతి వాళ్ళు తెలుగు వీడియో షాప్ కి తీసికెళ్ళారు.

నాకు సినిమాలంటే ఒక రకమయిన obsession. ఇక్కడ కెనడా లో తెలుగు కేసెట్లు అంతగా దొరకవు. ఎవరినైనా అడగాలి. ఎందుకులే అని చూడటమే మానేసాను. అక్కడ ఒక్కసారిగా బోల్డు తెలుగు సినిమా కేసెట్లు కనబడగానే.. నేను చూడని సినిమాలు ఏమయినా వున్నాయెమో అని చూస్తున్నాను. ఇంతలో ఆ shop owner వచ్చి అక్కడ నుంచునివున్న ముగ్గురు అబ్బాయిల్ని

"మీరు బయటకి వెళ్ళిపోండి సార్" అన్నాడు.

అదేంటి ఇలా అంటున్నాడు అని.. నేను సరీగ్గానే విన్నానా అని అనుమానం వచ్చి వాళ్ళ సంభాషణ వినసాగాను.

వాళ్ళకీ అదే అనుమానం వచ్చినట్టుంది...

"ఏం.. ఎందుకు... అడిగారు.. కొంచం అవమానం ఫీల్ అవుతూ.

"ఎందుకన్నది ఇప్పుడు అనవసరం.. ముందు వెళ్ళిపోండి.. ప్లీజ్ అన్నాడు ఓనర్ మళ్ళీ.

"ఎందుకెళ్ళాలి... మమ్మల్ని insult చేస్తున్నావు... ఏకవచనంలోకి దిగుతూ అన్నాడు ఆ కుర్రాళ్ళలో ఒకతను.

"ముందు బయటకి నడు... "

గొడవ పెరుగుతోంది అసలు ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడో ఆ ఓనర్ అర్దం కాక అంతా వాళ్ళనే చూస్తున్నారు.

నేను గుమ్మానికి అడ్డుగా మోకాళ్ళమీద కూర్చుని వీడియో టైటిల్స్ చదువుతున్నాను.ఇంక వాళ్ళని మెడ పట్టి బయటకి గెంటుతాడెమో .. వచ్చి నా మీద పడతారు అని నేను లేచాను అక్కడ నుంచి.

"చూస్తాం... నువ్వూ ఇక్కడ వాడివే... మళ్ళీ నీ షాప్ కి రాము.." షాప్ ఓనర్ కి ఒక వార్నింగిచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు.

ఇతను మామూలు గా కేసెట్లు సర్దుకోవటం మొదలుపెట్టాడు.

"అదేమిటి... అతను అలా మాట్లాడాడు..ఇలాగే చేస్తాడా బిజినెస్?" బయటకి వచ్చాక మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన్ని అడిగాను.

"నువు వాళ్ళ మాటలు వినలేదా?" అడిగారు అతను.

"లేదు.. ఏం.. ఏమన్నారు?" ప్రశ్నించాను.

"వాళ్ళు నిన్ను కామెంట్ చేస్తున్నారు.. నన్నుకూడా నేమో.. ఎక్కడెక్కడి నుంచీ పళ్ళెటూరి మేళాలన్నీ అమెరికా వచ్చేస్తాయి... సినిమాలనేసరికి... ఒళ్ళు మర్చిపోయి... పడుకుని కూడా చూస్తారు.. అన్నారు" చెప్పారు.

"నేను చాలా embarrass feel అయాను. ఎందుకంటే.. అక్కడ మోకాళ్ళమీద కూర్చుని కింద వరసలోని టైటిల్స్ చదువుతున్నది నేను.. అతను కాదు.

అంత మాత్రానికే తన బిజినెస్ ని ఇలా చేజేతులారా పాడు చేసుకుంటాడా...ఇంకా అనుమానంగా అడిగాను.

నీ ముందు కూడా..ఇంకొక అమ్మాయిని కామెంట్ చేసారు.. ఆమె కోపంగా తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. అది ఆ ఓనర్ చూసాడు.. బాగా చేసాడు... మా ఫ్రెండ్ అంది. ఇక్కడకి వచ్చినా ఆ చీప్ బుద్దులు పోనిచ్చుకోరు. కొంతమంది మరీ అమెరికా రాగానే ఇంక తనో పెద్ద బిల్ గేట్స్ అయిపోయాను అనుకుంటారు. ఒక అటెన్షన్ కోరుకుంటారు... ఆ తాపత్రయమే ఇలా అందరినీ కామెంట్ చేయటం.

ఇది మగవాళ్ళలోనే కాదు.. ఆడపిల్లల్లో నూ ఉంది... నాలో లేదా... ఎవరినయినా కామెంట్ చేయచ్చు... కాని అ ప్రోసెస్ లో మనం పలుచన కాకూడదు.

నేను ఇక్కడ తెలుగు అసోసియేషన్ దీపావళి ఫంక్షన్ కి వెళ్ళాను. అక్కడ కొన్ని ఫంక్షన్లు, దాన్ని కంపేర్ చేసిన వాళ్ళ ఫీట్లు చూసి బోల్డు కామెంట్లు చేసాను.. మళ్ళీ నేనే తర్వాత అనుకున్నాను... చాలా చీప్ గా బిహేవ్ చేసాను అని. ఇకపయిన అటువంటి పొరపాటు చేయను. ఆ రోజు ఆ కుర్రాళ్ళ మొఖంలో embarrassment నాకు ఇప్పటికీ గుర్తు వుంది.

కాలేజ్ రోజుల్లో మేము మా జూనియర్స్ ని టీజ్ చేసేవాళ్ళం... కానీ ఎప్పుడూ వాళ్ళని హర్ట్ చేసే extent కి వెళ్ళలేదు.

మనం వేరే వాళ్ళని టీజ్ చేసినపుడు అది తప్పు అనిపించనపుడు... మనం ఆ టీజింగ్ కి విక్టిం అయినపుడు మాత్రం టీజింగ్ తప్పు అని ఎందుకు అనుకోవాలి?

కానీ కొంతమంది వల్గర్ మాటలు వాడతారు... అక్కడ వస్తుంది ఇబ్బంది.

నేను ఇంటర్ లో వున్నపుడు.. మా క్లాసు లో ప్రచేతన్ అని ఒకతను ఉండేవాడు.. ఒకరోజు సంస్కృతం క్లాసు లో నిద్ర పోతున్నాడు... అది చూసిన మా లెక్చరర్ అతని మీద ఎదో జోక్ వేసారు.

నేను నా ప్రక్కన వున్న అమ్మాయితో అతనికి ఏం పేరు పెట్టివుండాల్సిందీ... అని డిస్కషన్ మొదలు పెట్టాను. అది అతను విన్నాడు.

వెంటనే నాకూ ఒక నిక్ నేమ్ పెట్టాడు. అంతే కాదు.. నేను ఆ కాలేజ్ లో చదివిన మిగిలిన 4 ఏళ్ళ లో ఆ నిక్ నేమ్ ని మర్చిపోనీయలేదు. అప్పుడు చాలా ఫీల్ అయాను.... కానీ... నేనే ముందు అతన్ని రెచ్చగొట్టాను... కనుక అనుభవిస్తున్నాను అని సర్దుకుపోయాను. అట్లా కాక ఎవరితో అయినా చెప్పి అతనికి బుద్దులు చెప్పే పని మొదలుపెట్టి వుంటే.. కధ మరొకలాగ వుండేది.

ఇందాకటి నిన్నేపెళ్ళాడుతా లోని పాటలోనే ఆ అమ్మాయి మనతో తన సీక్రెట్ ఒకటి షేర్ చేసుకుంటుంది..

"కాస్తో..కూస్తో కుర్రాళ్ళ గొడవ జిల్లంటుంది ప్రతి కన్నె ఈడు " నిజమే నెమో!

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.