"బావ కవితలు" - పార్థు Back   Home 
ఈ పేజీ ని పంపండి
అంటే భావోద్రేకం తోనో, భావం వుట్టిపడేల రాసినవో కావండి.
మా బావ గాడు (శివ) చెప్పిన వాటిల్లో గుర్తున్న కొన్ని కవితలు.
వాడు కవే అని కమిట్ అయిపోవడం తో, చెవి కొరికేసే వాడు తెల్లారి లేస్తే.
"సంస్కృతి", "సంస్కృతం" కి పెద్దపీట వెయ్యలని తెగ ఆరాట పడేవాడు.
కొన్ని కవితలలో మనల్ని ప్రశ్నిస్తే, కొన్నింటిలఒ సమాజాన్ని స్పౄశించేవాడు, మరికొన్నింటి లో వాడే ప్రశ్నేసుకుని, వాడే జవాబు చెప్పుకునేట్టు రాసే వాడు.
ఎవడి స్టయిల్ వాడిది కనుక, మానవ హక్కుల ఉల్లంఘనా పరిధి లోకి రానీకుండా ముక్కు మూసుకుని మరీ వినే వాళ్ళం.

- పార్థు

మచ్చుక్కు కొన్ని..

ఎగసిపడిన హౄదయాల హేల,
నింగినంటిన ఆనందాల మేళ,
మేలవించిన సన్నాయి రాగాల లీల,
పడుచు జంట వేసే ప్రణయాల ఈల.
............ఇప్పుడు మీ పరిస్థితే, ఇంచుమించు 20 ఏళ్ళ క్రితం మాది.

నెచ్చలి కోసం నిచ్చెన అవుతా,
వెచ్చని పరుపై గుచ్చుకుపొతా,
నచ్చిన మోము కి నగిషీ పెడతా
పచ్చని పసిమి తో గంధం పూస్తా
........ వొప్పుకున్న రెండూ అయిపొయాయి, ఇంక 'టే ' ఇప్పించాల్సిందే అనేవాళ్ళు జనాలు..

అది రుధిరం, ఇది అరుణం
ఏదిరా కమలం? (మనోడు BJP కి వీరాభిమాని లెండి)
పుట్టిన గుంట బురదే, కాని పట్టిన అంటదు దురద
తడిసి తరించిన తటాకం కదరా అది సోదరా?
............"నువ్వు ఆపి పదరా" అంతే స్పీడ్ లఓ వచ్చేది రిటార్ట్.

తను చూసింది, నా కళ్ళ కు తెలుసు
తను పలికింది, నా మనసుకు తెలుసు
తను పిలిచింది, నా ఊహల కి తెలుసు,
తను ఏడ్చింది..,
........."మీ విషయం వాళ్ళ నాన్న కి తెల్సింది" కదరా? శ్రీరాం గాడి సూటి ప్రశ్న.

ఘోషించాను నేను (అఘోరించావు లేరా అనేవాడు బాబాయి)
ద్వేషించింది తను
పోషిస్తా అన్నాను,
కోపిస్తుంది ఎందుకు?
........ రాత్రికి వాడి నుండి ISD కాల్ తధ్యం.

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత పార్థు కి తెలియచేయండి.