ఒక నిమిషం మౌనం - వంశీ కృష్ణ
ఈ పేజీ ని పంపండి

ఇంకా september 11 ని గుర్తు చేసుకుని భయపడే americans ఎవరైనా ఉన్నారా? ఉంటే, ఆ రోజు చనిపోయిన 5000 మంది కోసం ఒక నిమిషం మౌనం పాటిద్దాం.

సరే, దీని తరువాత, మరి 1991 gulf war లో చనిపోయిన 130,000 ఇరాక్ సైనికుల కోసం మరో 13 నిముషాలు మౌనం పాటించి, ఆ రోజుల్లొ americans ఎలా celebrate చేసుకున్నారో గుర్తు చేసుకుందాం.

ఇక, సద్దాం హుస్సేన్ కి ఆయుధాలు అందించి, 200,000 మంది ఇరాని సైనికుల మృతి కి కారణం ఎవరు ఎలా అయ్యారో గుర్తు చేసుకుని మరో 20 నిమిషాలు మౌనం పాటిద్దాం.

మరి CIA మద్దతు తో జరిగిన హింసాకాండ లో చనిపోయిన 150,000 మంది అఫ్ఘాని మరియు రష్యన్ల ఆత్మ శాంతి కోసం మరో 15 నిమిషాలు మౌనం.

రెండో ప్రపంచ యుద్దం లో , హీరోషిమా, నాగసాకీల్లో చనిపోయిన అమాయక జపనీస్ ప్రజల కోసం మరో 11 నిమిషాలు....

అంతా కలిపి చూస్తే, మనం ఒక గంట మౌనం పాటించాం.

అందులో కేవలం ఒక నిమిషం "అమాయక" అమెరికన్స్ కోసం, 59 నిమిషాలు ఎన్నో పాపాలు చేసిన , కరడు గట్టిన ఉగ్రవాదుల కోసం.

మరి, ఇది అన్యాయం కాదా?

ఉగ్రవాదుల జాబితా ఇంత చిన్నగా వుంది ఎమిటా అనుకుంటున్నరా?

అయితే, ఇంకా add చేద్దాం.

వియత్నాం యుద్దం లో మట్టి కొట్టుకుపోయిన వాళ్ళు, పనమా లో ఇళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు, అమెరికా sponsor చేసిన civil wars లో ప్రాణాలు పోగొట్టుకున్న, Chile, Argentina, Uruguay, Bolivia, Guatemala, El Salvador మొదలగు దేశ ప్రజలు, అమెరికా విధించిన ఆంక్షల వల్ల నష్ట పోయిన కోట్లాది పిల్లలు, ఇక కాశ్మీర్ లో జిహాద్ పేరుతో నరికివేయబడిన ప్రజలు..ఇలా లెక్కకు మించిన ఉగ్రవాదులు..వీళ్ళందరి కోసం మనం మౌనం పాటించడం ఎమిటి?

మనం, హాయిగా, అమెరికా మీద 13 నెలల క్రిందట జరిగిన దాడి గురించి మాట్లాడుకుని, కేవలం ఒకే ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం...ఎమంటారు?

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత వంశీ కృష్ణ కి తెలియచేయండి.