కోడిపిల్ల - అరుణ బీరకాయల
ఈ పేజీ ని పంపండి

మొన్న మేము ఫ్రెండ్స్ కలిసి నప్పుడు ఒక అబ్బాయి చెప్తున్నాడు తన చిన్నప్పటి విషయం ఒకటి...

వాళ్ళ అక్క పెళ్ళి అయినప్పుడు వాళ్ళ ఇంటి నిండా చుట్టాలు ఉన్నారంట. పెద్దవాళ్ళు కొంత మంది పేకాట ఆడుతూ మందు తాగుతున్నారంట. ఇంక ఆడవాళ్ళు పెళ్ళి వంటలు, మిగతా పనులూ చూసుకుంటున్నారంట.

మరుసటి రోజు పొద్దున్న పిల్లలు లేచి ఏదైనా ఆట ఆడుకుందాం అని సావిట్లోకి వెళ్ళారంట. అక్కడ ముందర రోజు రాత్రి పెద్దవాళ్ళు తాగి వదిలేసిన గ్లాసులు ఉన్నాయి. చూస్తే ఒక గ్లాస్ లో కొంత మందు ఉంది అంట. ఈ పిల్ల పిడుగులకి ఏమీ తోచక పక్కన ఇంట్లో ఒక బుట్ట కింద ఉన్న కోడి పిల్లను ఒకడు తెచ్చి...దాని నోరు బార్లా తెరిచి పట్టుకొన్నాడు అంట...ఇంకొకడు ఏమో ఆ గ్లాస్ లో మిగిలిపోయిన మందు ను ఆ కోడిపిల్ల నోట్లో పోసాడంట.

ఈ పిల్లల మూక లో ఆ కోడిపిల్ల చిన్న యజమానురాలు (పక్క ఇంటివాళ్ళ అమ్మాయి) కూడా ఉంది అంట. కోడిపిల్లను కింద పెట్టేసరికి పక్కకి వాలుతూ నడుస్తూ (తాగిన వాళ్ళు నడిచినట్టు) కొంత దూరం వెళ్ళి పుటుక్కున పడిపోయింది అంట.

మళ్ళీ అది చచ్చిపోతే పెద్దవాళ్ళు వీళ్ళ పెళ్ళి చేస్తారు అని, దానిని తీసి నీళ్ళ కుండీ లో జాగర్తగా ముంచి...దానిని జాడించి బయటకు తీసారంట.

దానికి ఓపిక అంతా పోయిందిట. చాటుగా తీసుకు వెళ్ళి బుట్ట కింద పెట్టారుట. అది పగలంతా లేవలేదుట!

వీళ్ళ కి భయం! ఇంక ఆ అమ్మాయి చెప్పేస్తుంది, పక్కింటివాడు వచ్చి గోల చేస్తే వీళ్ళ పని అవుతుంది అని. పొగలంతా ఆడుకోకుండా కిక్కురుమనకుండా ఆ బుట్ట దగ్గరే టచ్చాడారుట.

మధ్యలో దానిని కదుపుతూ ఉన్నారుట. ఒక సారి అనుకోకుండా దానిని కదిపితే అది లేచి వీళ్ళ అందరినీ చూసి గబ గబా జారుకుందిట.

గండం గట్టెక్కింది అని అనుకొని...మందు పట్టాక కోడి పిల్ల చేష్టలు తలచుకొని నవ్వుకున్నారుట!

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత్రి అరుణ బీరకాయల కి తెలియచేయండి.