మా ఊర్లో దాండియా!! - చావా
ఈ పేజీ ని పంపండి

మా ఊర్లొ ఇండియన్స్ కూడా ఏక్టీవ్ గానే ఉంటారండొయ్!! ఆది నిజం చేయడానికా ఆన్నట్లు మాకో ఆహ్వానం వచ్చింది ...దాండియా కి రమ్మని.. అకేషన్ దసరా (ofcourse దసరా ఆయిపొయాక లెండి)

మా ఊర్లో దసరా వారం ముందే చేసేసాం ..ఎందుకంటే మనకి హాలిడే ఎప్పుడో ఆప్పుడు జరుపుకోవాలి మరి! పండగ ఆసలు ఎప్పుడనేది మనకి ఆనవసరం. మేము ఇండిపెండెన్స్ డే కి జండా మధ్యాహ్నం 12 కి ఎగరేస్తాం..దసరా, దీపావళిలు దగ్గర లొ ఉన్న వీకెండ్ చేసుకొంటాం. సంక్రాంతి, ఉగాది లు కలిపి చేసుకొంటాం..ఇలా మాకు ఎప్పుడు కుదిరితే ఆప్పుడే పండగ!

సరే ఈరొజు లోకి వద్దాం..ఇవాళ దాండియా ఆన్నారు. సరే ఆని పోయాం...నాకు ఇష్టం లేదు ..కాని మా రవి గాడున్నాడే వాడు "ఎప్పుడూ ఇంట్లో కూచొని ఏమి చేస్తావ్? జనాల్లో కలవాలి" ఆని ఆన్నాడు.

జనాలు కలుస్తారు ...కాకపోతే విడదీసి కలుపుతారు లెండి..ఆర్ధం కాలేదా? భారతీయుడు ఎక్కడున్నా ఆంతే కదండీ? ఓ మీకు తెలీదేమో ..మా ఊర్లో రెండు అసోసియేషన్లు ఉన్నాయి ఇండియన్ వి..ఒకటేమో సౌత్ ఇండియన్స్ ది ఒకటేమో నార్త్ ఇండియన్స్ ది. ఇక విషయం మీకు ఆర్ధం ఆయిందనుకొంటాను.

దసరా కి దుర్గ పూజ చర్చ్ లో నండి! ఎవడండి ఇండియా సెక్యులర్ దేశం కాదు ఆంది? మా ఊర్లొ ఏ పూజ చేసినా మేము ఏదో ఒక చర్చ్ లోనే చెస్తాం! ఆదొక్కటే చాలు ఇండియన్స్ సెక్యులర్ ఆంటానికి! కాదంటారా?

కారు దిగి చర్చ్ తలుపు దగ్గరకి నడిచాం ..దారిలొ అన్నీ చెప్పులు, షూస్ కనపడ్డాయి. చెప్పులు విడిచి వెళ్ళాలా ఆక్కర్లేదా ఆనే సంశయం లొ పడ్డాం. చుట్టూ చూస్తున్నా "పాదరక్షలు ఇక్కడే విడువ వలెను" అని ఏమన్నా బోర్డ్ ఉందేమో అని! ఓ సారి లోపలికి చూసాం.. కొందరి కాళ్ళకి షూస్ కనపడ్డాయి. "సరే వేసుకెళ్ళొచ్చు" అని డిసైడ్ చేసాం. మేము ఈ అలొచనలొ మునిగి లోపలకి నడవబోతుండగా.. "3 dollors per head please" అని వినపడింది.

నేను గతుక్కుమన్నా ..నా దగ్గర పర్స్ లేదు. మా రవి దగ్గర ఉందేమో! ఉన్నా అందులొ డబ్బులు ఉన్నయో లేవొ నాకు తెలియదు! వాడు పర్స్ తీయడం చూసి ధైర్యం వచ్చింది. నలుగురి పేర్లు రాసా.. డబ్బులు వాడిచ్చాడు (ఇది ఫ్రీ ఎంట్రీ అని చెప్పిన వాళ్ళ మీద తెగ కోపం వచ్చిందనుకోండి!)

చుట్టూ చూసా లోపల ఓ సారి.. "ఒక్కటీ తెలిసిన మొహం లేదే?!" అనుకొంటుండగా సత్యనారాయణ అంకుల్ కనపడ్డారు. పలకరింపుగా ఓ చిరునవ్వు నవ్వా. "ఎవడురా నువ్వు?" అన్నట్టు చూసారు. అది మామూలేలే అనుకొని ఉన్న రెందు వరసల్లో చివరి వరుస లో సీటు చూసుకొని కూచొన్నా.

ఓ మూల ఆడియో సిస్టం ఉంది. దాని మానాన అది పాడుకొంటోంది! ఎవడి గొడవ లో వాడున్నాడు.. మొత్తం ఓ 50 మంది ఉన్నారేమో! కాసేపు అలవాటు పడ్డాక.. ఓ ప్రకటన వినిపించింది. "We are going to start it!" అని. "ఓహొ ఇంత సేపు ప్రాక్టీస్ చేస్తున్నారేమో!" అనుకొన్నా. ఇంతలో ఓ ఇద్దరు ఆంటీలు కొందరు కూచొని ఉన్న మధ్యలొకి వచ్చారు. ఒకవిడ స్టెప్స్ వేస్తూనే వచ్చారు. ఇంకొకావిడ ఆవిడని ఫాలో అవడానికి కష్టపడుతున్నారు! పాటలు వస్తునే ఉన్నాయి. నాకు తెలిసి అవన్నీ కృష్ణాష్టమి కి వినే పాటలు. ఏమో మరి ఉత్తర భారతం లో ఎప్పుడూ అవే వింటారెమో! లేదా ఇక్కడ మా వాళ్ళకి గీతా సారాంశం వంట పట్టిందెమో బాగా!

అదేనండీ నేనే సర్వం అని కదా కృష్ణ భగవానుడు అన్నాడు? దుర్గ, రామ్, విష్ణు... అంతా కృష్ణ మయం కదా! "అందుకేమోలే" అనుకొన్నా. మెల్లగా ఒక్కోరు వచ్చి ఆడటం మొదలెట్టారు. నేనిక అసలు ఆర్టిస్ట్ కోసం ఎదురుచూస్తున్నా. కాసేపటికి అర్ధం అయింది.. వేరే ఎవరూ రారు.. మనం వీళ్ళనే చూడాలి అని! "ఎవడికి వాడె యమునా తీరె" అన్నట్టు వేస్తున్నారు! ఒక్క చప్పట్లు మాత్రం ఒకేసారి కొడుతున్నారు! మ్యూజిక్ కి కలుస్తుందా లేదా అనేది మనకి అనవసరం! అసలా పాట ఏంటొ అక్కడున్న వాళ్ళలొ ఇద్దరికే (ఒకటి- ముందు డాన్స్ మొదలెట్టినావిడ.. రెండు- ఆ పాట పెట్టిన అంకుల్! ఇక్కడ DJ అనాలేమో వాళ్ళని!?) తెలుసేమో అని నా గాఢ నమ్మకం!

రెండు పాటలకి డాన్స్ చేసారు అందరూ. డాన్స్ అంటే డాన్స్ కాదేమో! ఏమనాలో దాన్ని నాకు తెలియదు! పోని ఈ సారికి డాన్స్ అనుకొందాం! ఇక డాన్స్ చేసేవాళ్ళు చుట్టూ ఉన్న మనుషుల్లొ మనని ఎవరు చూస్తున్నారు అనేది చూసుకోడమే సరిపోతోంది! చుట్టు తిరుగుతూ, వాళ్ళ ఆయన ఉన్న దగ్గరకి రాగానే ఓ నవ్వు విసురుతూ ఆంటీ లు!

ఇలా కాసేపు (చీరలు, ఓణీలు, చుడిదార్లు సర్దు కొంటూ) చేసాక మన DJ అంకుల్ మైక్ గందరగోళం లో ప్రకటన చేసారు. మాములుగా ఇండియా లొ అలవాటు అయింది కాబట్టి మనకి దాని సారాంశం "స్నాక్స్ టైము అయింది" అని అర్ధం అయింది.. సరే అందరు లైను లో పోయారు. అప్పుడు అంకుల్ కి గుర్తొచ్చింది.. రెండు లైన్స్ కట్టడానికి ఏర్పాట్లు చేసాం అని! మళ్ళా ప్రకటన చేసారు.. రెండు లైన్స్ కట్టండి అని! కట్టారు. ఒక్కొక్కళ్ళు 10 నిముషాలకంటే ఎక్కువ టైము తీసుకొంటున్నారు ఆ లైను లొ నుండి బయటకి రాడానికి! ఎందుకంత టైము పడుతుందో నాకు తెలియలేదు! నేను లైను లొ లేను కాబట్టి!

అంకుల్ మైకు లో మొత్తుకుంటూనే ఉన్నాడు.. "అయిదు నిముషాల్లొ అయిపొవాలి.. తరువాతి ఐటెమ్ కి లేట్ అవుతుంది" అని! మన వాళ్ళు లైను లో లోకాభిరామాయణం మాట్లాడుకొంటున్నారు.. ఆ మాటలు ఎవడికీ వినపడ్డం లేదు. మధ్యలొ అంకుల్ జోకులు! "ఇండియన్ టైము 5 నిముషాలు అంటే అరగంట కూడ అయింది" అని! అమెరికన్లు ఎవరు రాలేదు కాబట్టి ఫర్లేదు.. లేకపోతె మన దేశం గొప్పతనం అలా మైకు లొ అరిచి మరీ చెప్తుంటే విని ఏమనుకొనేవారు??

స్నాక్స్ అయ్యాక మళ్ళా ఓ పాటకి చప్పట్ల డాన్స్ చేసాక, అప్పుడు అందరికి దాండియా లు ఇచ్చారు. నాకు తెలిసీ ఆ రోజు ఈవెంట్ "దాండియా రాస్". అంటే అమ్మాయిలు, అబ్బాయిలు గుండ్రం గా నుంచొని.. ఒకరి మనసులొ భావాలు ఒకరికి వెళ్ళడయేట్లు కళ్ళతొ మాట్లాడుకోవాలి! మా ఊర్లొ అమ్మాయిలు, అబ్బాయిలు లేరు కాబట్టి.. ఆంటీలు, అంకుళ్ళూ ఆ రోల్ తీసుకొన్నారు! కాసేపు చూసాక మా రవి కూడ పొయాడు "నేను కూడ చెస్తా" అని! నేను నవ్వుతూ కూచొన్నా. పాపం ఒక రౌండ్ చేసి వచ్చేసాడనుకొంటా. ఇంకాసేపు ఉన్నాక మాములుగా మనకి మొనొటమస్ లా అనిపించింది.. లేచి వచ్చేసాం.

ఇంతకీ ఇక్కడ అసోసియేషన్లు పెట్టి పార్టీలు, పండగలు జరుపుకొనేది దేనికి? నాకు తెలిసి ఒకటి- పండగ వాతావరణం కలిగించడానికి, రెండు- మన సంస్కృతి గురించి ఇక్కడ వాళ్ళకి తెలియపరచడానికి. ఆ రెండిట్లో ఏదీ కూడా మా ఊరి దాండియా లొ కనపడలేదు! మీ ఊర్లొ కనపడితే చెప్పండి ప్లేజ్!

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత చావా కి తెలియచేయండి.