ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే.. - శ్రీనివాస కుమార్
ఈ పేజీ ని పంపండి

పెద్దలు అంటే కొన్ని మాటలు ఏమో అనుకొంటాం కాని కొన్ని మాత్రం అక్షర సత్యాలు. ఆడగాలి పాడుగాలి సుమా. వీరి ఏ మాటకైనా సరే రెండు అర్ధాలు ఉంటాయి. ఇదిగొ ఇదిగొ స్త్రీ ద్వేషి అని నా మీద విరుచుకుపడకండి. ఇస్తా ఉదహరణలు ఇస్తా ఆ పైన మీ చేతనే ఈ పాట పాడిస్తా..

1.సందర్బం ఒకటి..

ఇద్దరు ప్రేమికుల మధ్య సంభాషణ...

"సిద్దు నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎందుకో తెలుసా నీలో ఉన్న నిజాయితి మీద నాకు చాల నమ్మకం నీవు నాకు దక్కటం నా అదృష్టం నీవు అందరి మగాళ్ళలాగ కాదు నీవు చాల మంచివాడివి."

కొంచెం కరిగిపోయిన సిద్దు ఆమె చేయి పట్టుకొంటాడు. ఆమె వెంటనే "వద్దు సిద్దు ఇలాంటివి అన్నీ పెళ్ళి అయిన తరువాతే".

"అదేమిటి ప్రీతీ నేనంటే అంత ఇష్టం అని చెప్పావు?"

"ఇష్టమే కాని నేను ఇలాంటి విషయాల్లో మగాళ్ళని నమ్మను."

....అరే రెండే నిమిషాల్లో రెండు భావాలా? అందుకనే ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే!

2. సందర్భం రెండు..

ఒక ఏకాంత వేళ చల్ల గాలి తెమ్మరలు ప్రియురాలి తల లో సన్నజాజుల సువాసన ని ద్విగుణీకృతం చెస్తుంటే అతను తన తల ఆమె భుజం మీద ఆనించాడు ..

ఆమె చప్పున "వద్దు ఎవరైన చూస్తారు వద్దు."

ఇంక అతను "అబ్బో తను ఎంత మంచిది! తాను తొందరపడ్డా ఆమె వద్దని వారించింది" అని మురిసిపోతాడు.

కాని అక్కడ ఆమె తొందరపడద్దు అనలేదు. ఎవరైనా చూస్తారు వద్దు అంది.

....అంటే ఎవరూ చూడకపోతే? ఆడువారి మాటలుకు అర్ధాలె వేరులే

3. సరే ఆ మధ్య అందాల పోటిలు జరిగాయి. మాహిళ నినాదాలు. "పురుషహంకారం నశించాలి".. "అందాల పోటీలు అరికట్టాలి" అని! ఇది మరీ బాగుంది. అక్కడ అందం చూపిస్తుంది మహిళలు ఎవరు వారిని బలవంతాన వచ్చి పాల్గొనండి అని చెప్ప లేదు. కాని, వాళ్లని ఏమీ అనరు వీళ్ళు! తప్పు మగవాళ్లది అంట! ఓహో! మరీ విడ్డూరమే ఇది.

అలాగే అడ్వర్ టైజ్ మెంట్స్ లో స్త్రీలని అశ్లీలంగా చిత్రికరిస్తున్న మగవాళ్లని శిక్షించాలి అంట! ఇది మరి బాగానే ఉంది డబ్బులు దండీగా తీసుకొని నటించే తమ జాతి స్తీలని ఎమి అనరు అంట కానీ మగాళ్ళ ది తప్పు అంట!

....అందుకే, ఆడువారి మాటలుకు అర్ధాలే వేరులే!

4. అలాగే వీళ్ళ నినాదం "స్త్రీలు పురుషులకి ఏ మాత్రం తీసిపొరు. అన్ని రంగాల్లొను మహిళలు దే పై చేయి!"

అబ్బా వెంటనే పార్లమెంట్ లో వీళ్ళ కేకలు ఉద్యొగాల్లోనూ ఎలక్షన్ల లో నూ మగవారి తో వెనుకబడ్ద మహిళ లకి 33% రిజర్వేషన్ కావాలి. అదేమిటి మగవారితో సమానం అన్నారుగా మరి? సమానం అయినప్పుడు రిజర్వేషన్ ఎందుకు?

....అందుకే .ఆడువారి మాటలుకు అర్ధాలే వేరులే!

ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో.......

అందుకే ఒక కొత్త కవి అన్నాడు "అణ్వాయుధాల కన్నా ఆడువారు ప్రమాదకరం అని!" ఎందుకు?

అందుకే, ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే!

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత శ్రీనివాస కుమార్ కి తెలియచేయండి.